కేసీఆర్ డబ్బుతోనే జగన్ గెలిచాడు : దేవినేని ఉమా

-

సీఎం జగన్ గెలుపుకు కేసీఆర్ డబ్బు సమకూర్చారని అందుకే… తెలంగాణ ప్రభుత్వ తీరుపై జగన్‌ స్పందించడం లేదని … టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ సీఎం జగన్ చంకనాకిస్తున్నాడని.. అధికారులు గుడ్డిగా జూరాల ప్రాజెక్ట్ వ్యవహారాన్ని గాలికి వదిలేసి కేఆర్ఎంబీ ఎదుట తలలూపుతుంటే, సీఎం, మంత్రులు గడ్డి పీకుతున్నారా..? అని ప్రశ్నించారు.

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలో చేర్చడానికి ఒప్పుకున్నవారు, జూరాలను ఎందుకు వదిలేశారు? జూరాలతో పాటు నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న 17, 18 ఆఫ్ టెక్ లను కూడా సీఎం గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మే 27-2016లో చంద్రబాబు హాయాంలో కేంద్ర జల వనరుల శాఖ.. ఇరు రాష్ట్రాలతో మాట్లాడి రూపొందించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను జగన్ ప్రభుత్వం విస్మరించిందని… పొరుగు రాష్ట్రం దర్జాగా 150 టీఎంసీలు తరలించుకోవడానికి ముఖ్యమంత్రే అనుమతించారా? అని ప్రశ్నించారు. జూరాల దిగువన పక్క రాష్ట్రం ప్రాజెక్టులు నిర్మించి నీటిని తరలిస్తుంటే, 29 నెలల నుంచి విద్యత్ ఉత్పత్తి చేస్తుంటే జగన్ ఏం చేస్తున్నాడు? తక్షణమే సీఎం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు దేవినేని ఉమా.

Read more RELATED
Recommended to you

Exit mobile version