టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన తన మ్యూజిక్ తో సంగీత ప్రియులను అలరిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలతో మ్యూజిక్ కంపోస్ చేస్తూ దూసుకుపోతున్న ఈయన కొత్త, పాత అనే తేడా లేకుండా ప్రతి ఒక్క జనరేషన్ ను తన మ్యూజిక్‌తో అలరిస్తూ వస్తున్నారు. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో మరొకసారి తానేంటో నిరూపించుకున్న దేవిశ్రీప్రసాద్ ఇప్పుడు మరికొన్ని సినిమాల తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
వయసు మీద పడుతున్నా ఆయన మాత్రం పెళ్లి చేసుకోలేదు.. గత కొంతకాలంగా వారిని ప్రేమిస్తున్నారు వీరిని పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు వినిపించాయి కానీ అందులో నిజం లేకపోయింది. దీంతో ఇప్పుడు మళ్లీ దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ ఒక వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 43 సంవత్సరాలు వయసున్న దేవిశ్రీప్రసాద్ గత పది ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకుంటాడు అని వార్తలు వస్తున్నాయి కానీ అలా ఏం జరగలేదు . అయితే గతంలో హీరోయిన్ ఛార్మితో ప్రేమలో పడ్డాడని పుకార్లు వచ్చాయి అందులో నిజం లేకపోయింది.
ఇక ఇప్పుడు తన కుటుంబ సభ్యుల్లోనే ఒక అమ్మాయిని ఆయన వివాహం చేసుకోబోతున్నాడు అంటూ సమాచారం. అయితే దేవి శ్రీ ప్రసాద్ కి వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని తనకు కాబోయే భార్యగా చేసుకోబోతున్నారట. ఆమె వయసు 26 సంవత్సరాలు అంటే దేవిశ్రీప్రసాద్ కంటే 17 సంవత్సరాలు చిన్నది. ఇందులో ఎంత నిజం ఉందో లేదో తెలియదు కానీ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడైనా ఒక ఇంటి వాడు కావాలని అందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.