కిసాన్ క్రెడిట్ కార్డుల విషయంలో తీపికబురు అందించింది కేంద్ర సర్కార్. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంచింది మోదీ సర్కార్. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇప్పటివరకు 3 లక్షల రూపాయల రుణం అందిస్తుండగా ఇకపై ఆ మొత్తం 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు నిర్మలా సీతారామన్.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఫలితంగా రైతులకు ఎక్కువ మొత్తంలో రుణం లభించనుందని తెలిపారు నిర్మలా సీతారామన్. అటు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన కార్యక్రమాన్ని ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ పథకం ద్వారా వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన చేయనున్నట్లు వివరించారు. ఒక కోటీ 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ప్రకటించారు.