ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ అయోధ్య గురించి మాట్లాడుకుంటున్నారు. సోమవారం నాడు అయోధ్య రామ మందిరం లో బాల రాముడి కి ప్రాణప్రతిష్ట చేసిన విషయం అందరికీ తెలుసు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి భారీ ఎత్తున భక్తులు అక్కడికి చేరుకోగా ఎవరిని కూడా లోపలికి పంపించలేదు దీంతో భక్తులందరూ కూడా స్థానిక హోటల్స్ బస్టాండ్లు రైల్వేస్టేషన్లో రోడ్ల మీద రాత్రి స్టే చేసి ఈరోజు ఉదయాన్నే ఒక్క సారిగా ఆలయం మీదికి పొట్టిత్తారు.
దీంతో అధికారులు తెల్లవారుజామున మూడు గంటల కి గేట్లు తెరిచి భక్తుల్ని ఆలయం లోకి అనుమతించారు ఈ టైం లో తోపులాట కూడా జరిగింది ఈ విషయం తెలుసుకున్న రామ భక్తులు ఈసారి లక్షల్లో ఆలయ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు అధికారులు మాత్రం ఏమీ చేయలేకపోయారు. అయితే రద్దీ ఎక్కువ ఉండడం వలన అయోధ్య రామ మందిరం ప్రవేశానికి తాత్కాలికంగా మూసివేశారు.