అదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క నేడు పర్యటించారు జంగు భాయ్ జాతర నేపథ్యంలో కెరమెరి మండలం గుండి గ్రామ పరిధిలో జలజంగుబాయి పుణ్యక్షేత్రానికి సీతక్క వెళ్లారు ఆదివాసులతో కలిసి వాళ్ళ ఆచార సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. గుట్టలో ఉన్నటు వంటి గుహ లోపలికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు మంత్ర సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగుబాయి దేవత ఆదివాసుల అరాధ్య దైవం అని అన్నారు ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన జంగుబాయి పుణ్యక్షేత్రం ప్రకృతికి ఎటువంటి హాని కలిగించకుండా అభివృద్ధి చేస్తామని అన్నారు.
పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిధులు కేటాయించి భక్తులకి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు పుష్య మాసంలో జరిగే కేస్లాపూర్ నాగోబా జాతరకి 20 లక్షల రూపాయలని కేటాయించినట్లు సీతక్క అన్నారు. గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడి చేసిన ఘటనపై సీతక్క స్పందించారు అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు.