డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు… ప్రజల్లో కోవిడ్ గైడ్ లైన్స్ పై పోలీసులు అవగాహన కల్పించాలని సూచన

-

కరోనా పరిస్థితులపై డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 30 నుంచి జనవరి 2 వరకు ఖచ్చితంగా ఆంక్షలు ఉన్నాయని.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. ప్రజలందరు కూడా పబ్లిక్ ప్లేసుల్లో భౌతిక దూరంతో పాటు మాస్కులు తప్పకుండా ధరించాలని సూచించారు. జిల్లాల పోలీస్ అధికారులకు, పోలీస్ కమిషనర్లకు ఇప్పటికే సూచనలు చేశామని, ప్రజలు కోవిడ్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామన్నారు. ప్రజలు మాస్కులు ధరించేలా పోలీసులు అవగాహన పెంచాలని సూచించారు. వారివారి ప్రాంతాల్లో ప్రభుత్వ కోవిడ్ ఆదేశాలు పాటిాంచేలా పోలీసులు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు జరగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.  తెలంగాణలో హోటళ్లు, క్లబ్బులు, పబ్బులు ఖచ్చితంగా కోవిడ్ గైడ్ లైన్స్ పాటించాలని హెచ్చరించారు. పోలీస్ శాఖలో ఉన్న సిబ్బంది అందరికి ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేశామని డీజీపీ వెల్లడించారు. ఎవరైాన టీకా తీసుకోకుంటే తీసుకునే విధంగా మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. విధి నిర్వహణలో ఉండే పోలీసులు ఖచ్చితంగా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా ఆదేశించమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version