ఎన్టీఆర్ ఎపిసోడ్.. ధనుంజయ నాయుడుకు చంపేస్తామని బెదిరింపులు

-

జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే కాల్ రికార్డింగ్‌ ఇష్యూలో కీలక పరిణామం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే కాల్ రికార్డింగ్‌ను లీక్ చేసిన ధనుంజయ నాయుడుకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయట. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నుంచి నాకు ప్రాణహాని ఉందని తాజాగా వెల్లడించారు ధనుంజయ నాయుడు.

ntr tdp
Dhananjaya Naidu receives death threats for leaking call recording of TDP MLA insulting Jr NTR

నన్ను నా ఫ్యామిలీని చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఆ ఆడియో కాల్ ఫేక్ అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని నాపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు చేశారు ధనుంజయ నాయుడు. ఎమ్మెల్యే దగ్గుబాటి అనుచరుల నుంచి నాకు ప్రాణహాని ఉందన్నారు. పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ధనుంజయ నాయుడు. కాగా జూనియర్ ఎన్టీఆర్‌ను లం* కొడుకు అంటూ బూతులు తిట్టారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news