తమిళ స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య, సూపర్ స్టార్ రజిని కాంత్ కూతురు ఐశ్వర్య ఆస్పత్రిలో చేరింది. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఐశ్వర్య తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించింది. దీంతో తాను ఆస్పత్రిలో చేరానని తెలిపింది. తాను కరోనా నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనాతో ఆస్పత్రి లో చేరాల్సి వచ్చిందని అన్నారు. ఈ 2022 ఏడాదిలో తన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో అనే అర్థం వచ్చేలా ఓ కామెంట్ ను కూడా జోడించింది.
కాగ రజిని కాంత్ కూతురు ఐశ్వర్య షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చింది. కాగ ఇక్కడే ఐశ్వర్యకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలుస్తుంది. కాగ ఇటీవల చాలా మంది సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు. షూటింగ్ లలో పాల్గొంటు.. కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రెటీలకు కరోనా వైరస్ షూటింగ్ స్పాట్ లలోనే సోకింది. ఆ లిస్ట్ లో తాజా గా ఐశ్వర్య రజిని కాంత్ కూడా చేరింది.