ధర్నా చౌక్‌లో కాదు.. మీ నాన్న ఫాంహౌజ్ ముందు ధర్నా చేయ్ : ఎంపీ చామల

-

బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కవిత ఆద్వర్యంలో తలపెట్టిన బీసీ ధర్నా కార్యక్రమంపై శుక్రవారం ఎంపీ చామల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో ధర్నాలే చేయనివ్వకుండా బీసీలను విస్మరించిన ఘనత గులాబీ పార్టీదని ఫైర్ అయ్యారు. బీసీల నినాదం ఎత్తుకుని ధర్నా చౌక్‌లో ఎమ్మెల్సీ కవిత ధర్నాకు పిలుపునివ్వడం హస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ చేపట్టిన కులగణన బీసీల కోసమేనని వివరించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కాదు.. కులగణన సర్వే రిపోర్టు ఆధారంగా బీసీల రిజర్వేషన్ పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది తెలుసుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వే చేపట్టిందన్నారు.తన నిరసన వల్లే రిజర్వేషన్లు వచ్చాయని చెప్పుకోడానికి కవిత ధర్నా చేపట్టిందని ఎంపీ చామల సెటైర్లు వేశారు. ధర్నా చేయాలనుకుంటే ధర్నాచౌక్‌లో కాదు.. మీ నాయన ఫామ్‌హౌస్‌ ముందు చేయు అని భువనగిరి ఎంపీ మండిపడ్డారు. మీకు బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ అధ్యక్షుడిగా బీసీని ప్రకటించండి.. అంటూ సవాల్ విసిరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news