ఏపీలో ఉచిత బస్సు అమలు చేయాలనే లక్ష్యంతో.. కర్ణాటకలో పర్యటించారు మంత్రులు. కర్ణాటకలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేస్తున్నామని ఈ సందర్భంగా హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ నేతృత్వంలో బెంగళూరులో పర్యటించడం జరిగిందని తెలిపారు. కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి గారిని సహా కర్ణాటక ఆర్టీసీ అధికారులతో చర్చిస్తున్నామన్నారు.
స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే తో కలిసి ఈ పథకం అమలు చేయడం పై కసరత్తు జరుగుతోందని వివరించారు హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. కర్ణాటక లో మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం, లబ్ధి గురించి కర్ణాటక బస్సుల్లో ప్రయాణం చేస్తూ వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత.