మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించిన మరుక్షణమే దిగ్విజయ్ సింగ్ పార్టీని వీడుతున్నట్లు రాజీనామా లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారి సంచలనం సృష్టించింది. కానీ ఈ విషయంపై దిగ్విజయ్ సింగ్ స్పందించి ఇందులో ఎటువంటి వాస్తవం లేదని.. రాజీనామా లేఖ కూడా ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ఈ లేఖపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చామని తెలిపారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ను ఎదుర్కొనే దమ్ములేక ఇలా అబద్దపు ప్రచారాలకు పాల్పడిందని కామెంట్ చేసింది. నేను 1971 లో ఎటువని పదవీ కాంక్ష లేకుండా కాంగ్రెస్ లో చేరాను, అప్పటి నుండి కాంగ్రెస్ సిద్ధాంతాల కోసమే నేను పనిచేస్తున్నాను…
నా చివరి శ్వాస ఆగిపోయే వరకు ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లోనే ఉంటానని దిగ్విజయ్ సింగ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.