గతంలో ఒక అమ్మాయిని మానభంగం చేసి పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటన ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. ఈ కేసును అప్పట్లో దిశ కేసుగా గుర్తించారు. ఈ పేరు మీద ఓ ప్రభుత్వం సైతం దిశ పేరుతో చట్టాన్ని మరియు పోలీస్ స్టేషన్ లను తీసుకువచ్చింది. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వారిని సీన్ రికన్స్ట్రక్షన్ పేరుతో కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ అండ్ టీమ్ ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్కౌంటర్ చట్ట విరుద్ధంగా జరిగిందని కోర్టు లో కేసు వేయడంతో అప్పటి నుండి హై కోర్టు లో కేసు జరుగుతూ ఉంది. కాగా ఈ రోజు ఈ కేసు వాయిదా ఉండడంతో ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్న 10 మంది పోలీసులకు వాదనలు వినిపించాలని సిర్పూర్కర్ కమిషన్ కు నోటీసులు ఇచ్చింది.
తెలంగాణ: సంచలన ఎన్కౌంటర్ “దిశ” కేసు విచారణ వాయిదా !
-