పవన్ ఎఫెక్ట్: ఆ జిల్లాల్లో వైసీపీకి మైనస్ తప్పదా?

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్..అప్పుడప్పుడు మాత్రమే ఏపీ రాజకీయాల్లో కనిపిస్తున్నా..ఆయన చుట్టూ రాజకీయం మాత్రం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. వైసీపీ నేతలు ఆయనపై ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన వల్ల వైసీపీకే నష్టం ఉంది కాబట్టి. ఎప్పుడైనా పవన్ వచ్చి వైసీపీపై విమర్శలు చేస్తే…వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారంటే అర్ధం ఉంటుంది.

కానీ ఆయన రాని సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారంటే..పవన్ వల్ల వైసీపీకి ఉండే నష్టం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి గత ఎన్నికల్లో పవన్ వల్ల వైసీపీకి లాభం జరిగింది. జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఓట్లు చీల్చడం వల్ల టి‌డి‌పికి నష్టం జరిగింది..వైసీపీకి లాభం జరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచేది ఏమో గాని..151 సీట్లు మాత్రం రావడానికి కారణం పవన్ అనే చెప్పాలి.  విడిగా పోటీ చేయడం వల్ల దాదాపు 50 సీట్లలో గెలుపోటములని ప్రభావితం చేశారు. ఆ సీట్లలో ఓట్లు చీల్చి టి‌డి‌పి ఓటమి, వైసీపీ గెలుపు సాధ్యమైంది.

అంటే నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పితో పవన్ కలిస్తే వైసీపీ పరిస్తితి ఏం అవుతుందో ఊహించుకోవచ్చు. అసలే ఆ పార్టీపై వ్యతిరేకత ఉంది..అలాంటి పరిస్తితుల్లో టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీ పరిస్తితి డేంజర్ జోన్ లోనే. అందుకే పవన్ ని వైసీపీ నేతలు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఆయనని రెచ్చగొట్టేలా విమర్శలు చేసి..ఒంటరిగా పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఒకవేళ పవన్..టి‌డి‌పితో కలిసిన తమకు నష్టం జరగకూడదని చెప్పి..ఆయనని నెగిటివ్ చేయడానికి చూస్తున్నారు. కానీ ఎన్ని చేసిన ప్రజల్లో పవన్ పై పాజిటివ్ ఉంది. కాబట్టి వైసీపీకి పవన్ వల్ల నష్టం మాత్రం తప్పదనే చెప్పాలి. ముఖ్యంగా విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు..ఈ జిల్లాల్లో వైసీపీకి పవన్ వల్ల పెద్ద దెబ్బ.

Read more RELATED
Recommended to you

Exit mobile version