కూరగాయల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటా ధర ఇప్పటికే వంద దాటిన సంగతి తెలిసిందే. ఏకంగా కిలో టమాట ధర రూ.150 కు చేరువ అయ్యింది. అయితే ఇప్పుడు దొండకాయ కూడా అదే దారిలో నడుస్తోంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా డోర్నకల్ మార్కెట్లో కిలో దొండకాయ రూ.100 పలికింది. ఉమ్మడి వరంగల్ లో కూడా దొండకాయ కిలో వంద రూపాయలు పలుకుతోంది. వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాలకు శ్రీకాకుళం నుండి దొండకాయ దిగుమతి అవుతుంది.
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో దిగుమతులు ఆగిపోయాయి. దాంతో ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం హబ్బళ్ళి నుండి తెప్పించడంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. కూరగాయల ధరలు పెరగటం తో నాన్ వెజ్ ప్రియులు కూరగాయలు తినే కంటే ముక్క తినడమే మేలు అనుకుంటున్నారు.