దిశ ఎన్ కౌంటర్ స్థలానికి నేడు సిర్పుర్కర్ కమిటీ…

-

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు దిశ గ్యాంగ్ రేప్ కేసు. అత్యంత పాశవికంగా యువతిని అత్యాచారం చేసి… చంపి దేశాన్ని తగలబెట్టారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసను ఎగిసిపడ్డాయి. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్లు వచ్చాయి. ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తడి కూడా వచ్చింది. విచారణలో భాగంగా కేస్ రీకన్ స్ట్రక్షన్ చేస్తున్న క్రమంతో 4గురు నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించడం.. పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులు హతం అయ్యారు. ఈ ఎన్ కౌంటర్ పై అప్పట్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది.

ఇదిలా ఉంటే ఎన్ కౌంటర్ ను కొన్ని పౌరసంఘాలు వ్యతిరేఖించాయి. ఎన్ కౌంటర్ పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్ట్ సిర్పుర్కర్ విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కమిషన్ అప్పటి సీపీ సజ్జనార్ తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులను విచారించింది. తాజాగా కమిషన్ ఎన్ కౌంటర్ జరిగిన స్థలాన్ని సందర్శించనుంది. సిర్పుర్కర్ కమిటీ ఎన్ కౌంటర్  జరిగిన చటాన్ పల్లి ప్రాంతానికి వెళ్లి అక్కడ క్షేత్రస్థాయి అంశాలని పరిశీలించనుంది. దిశ డెడ్ బాడీనికి దహనం చేసిన ప్రాంతాన్ని కూడా విచారణ కమీషన్ చూడనుంది. ఈ కమిషన్ కు సీఆర్ఫీఎఫ్ బలగాలు వై కేటగిరీ భద్రతను కల్పించనున్నాయ.

Read more RELATED
Recommended to you

Exit mobile version