కెఎల్ రాహుల్’ ఆడితే అతివృష్టి… ఆడకపోతే అనావృష్టి. ఇతని గురించి ఇప్పటి వరకు క్రికెట్ అభిమానుల్లో ఉన్న అభిప్రాయ౦ ఇదే. నాలుగేళ్ళు అయింది అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి. అతని ప్రతిభ గురించి మన క్రికెట్ కంట్రోల్ బోర్డు కి తెలుసు, టీం కెప్టెన్ కి తెలుసు, అభిమానులకు తెలుసు. కాని అతను మాత్రం పెద్దగా ఆడినట్టు ఎక్కడా కనపడలేదు. అంతర్జాతీయ క్రికెట్ లో తన మార్క్ మాత్రం పడింది.
తాజాగా కివీస్ తో ముగిసిన 5 మ్యాచుల టి20 సీరీస్ లో భాగంగా రాహుల్ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఓపెనర్ గా అతను ఆడిన ఆటకు అభిమానులు ఫిదా అయిపోయారు. సీరీస్ మొత్తం అతని వలనే టీం ఇండియా గెలిచింది అనేది వాస్తవం. జట్టుకి తన నుంచి ఎం కావాలో అది అతను ఇచ్చేసాడు. టీం ఇండియాకు మళ్ళీ ధోనీ కావాలి. అవును ధోని అవసరం చాలా ఉంది.
అది తెలుసుకున్నాడో ఏమో తెలియదు గాని ధోని పాత్రను సమర్ధవంతంగా రాహుల్ పోషించాడు. ఓపెనర్ గా బ్యాటింగ్ లో దుమ్ము రేపి 224 పరుగులు చేసాడు. కీపర్ గా కూడా రాణించాడు. మంచి క్యాచ్ లు అందుకోవడమే కాకుండా DRS కాల్‌లతో కెప్టెన్‌కు కూడా సహాయం చేశాడు. 5టి 20 లో రోహిత్ గాయపడటంతో రాహుల్ చేజింగ్ సమయంలో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు.
కీలక సమయంలో అతను వికెట్లను పడగొట్టడానికి రచించిన వ్యూహాలు కివీస్ ని దెబ్బ కొట్టాయి. రాహుల్ అంతర్జాతీయ స్థాయిలో వికెట్ కీపింగ్‌కు కొత్తగా ఉండవచ్చు, కాని అతను కర్ణాటక మరియు అతని ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఈ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు రవిశాస్త్రి ఇప్పుడు రాహుల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.