ఐపీఎల్ 15వ సీజన్ లో మహేంద్ర సింగ్ ధోని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కోల్‌కత్త తో జరిగిన తొలి మ్యాచ్ లో అర్థ శతకం బాదిన ధోని.. లక్నోతో జరిగిన మ్యాచ్ లోనూ తన బ్యాట్ ను ఝులిపించాడు. కేవలం 6 బంతుల్లోనే 16 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అందులో 2 ఫోర్లు, ఒక సిక్స్ కూడా ఉంది. నిన్నటి మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును సృష్టించాడు. టీ 20 మ్యాచ్ లలో 7 వేల పరుగులు పూర్తి చేసిన మొదటి భారత వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు.
ధోని కంటే ముందు భారత బ్యాట్స్ మెన్లు.. కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రైనా, ఉతప్ప కూడా 7 వేలకు పైగా పరుగులు చేశారు. వీరి తర్వాత ఆరో వ్యక్తిగా ధోని రికార్డు నమోదు చేశాడు. కాగ ధోని ఇప్పటి వరకు 308 టీ 20 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 38.59 సగటుతో, 134.35 స్ట్రైక్ రేట్ తో 7,001 పరుగులు చేశాడు. అలాగే ధోని కేరీర్ లో ఇప్పటి వరకు 28 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు 84 నాటౌట్ గా ఉన్నాడు.