కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ టైంలో దేశవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిన సంగతి అందరికీ విదితమే. ఇందులో రైళ్లు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వలస కూలీల కోసం ప్రత్యేకంగా రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలకు మాత్రం అందుబాటులో లేవు. అయితే, కొవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్ పూర్తయిన కొద్ది రోజుల వరకూ ట్రైన్స్ స్టార్ట్ కాలేదు. ఇటీవల కాలంలోనే ట్రైన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే, జనరల్ కంపార్ట్‌మెంట్స్ ఏర్పాటు చేయడం లేదు. దేశంలో మళ్లీ కొవిడ్ విజృంభణ పెరిగిపోవడమే ఇందుకు కారణం.
దీనికి తోడు కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజారవాణా వ్యవస్థ అయిన ట్రైన్స్ ద్వారా కరోనా ఇంకా విజృంభించే అవకాశముంటుంది. ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్లలో క్రమం తప్పకుడా శానిటైజేషన్ చేయించడంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం శానిటైజర్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ అధికారులూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే మనం ఇప్పుడు తెలుసుకోబోయే రైలు రూట్ వెరీ లాంగ్ డిస్టెన్స్‌ను కవర్ చేస్తుందట.ఇంతకీ సదరు రూట్‌కు నడిచే ఎక్స్‌ప్రెస్ పేరేంటో తెలియాలంటే మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే.
ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇలాంటి కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో అది చాలా ఉపయోగపడుతుంది. మన దేశంలో చాలా దూరం పాటు ప్రయాణించే రైలు ఇదేనని చెప్పొచ్చు. అదే ‘వివేక్ ఎక్స్‌ప్రెస్ ’. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు 4,273 కిలోమీటర్ల దూరం ఈ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తుంది. తొమ్మిది రాష్ట్రాల మీదుగా ఈ ట్రైన్ రూట్ సాగిపోతుంది. మార్గమధ్యలో 56 రైల్వేస్టేషన్‌లలో ఈ ట్రైన్ ఆగుతుంది. దిబ్రూగఢ్‌లో మొదలైన రైలు కన్యాకుమారి చేరడానికి ఫైవ్ డైస్ టైం పడుతుంది. కాగా, ఇది వీక్లీ ట్రైన్. ఇకపోతే ఇందులో ప్రయాణించే వారు లాంగెస్ట్ రూట్ కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయాణించాల్సి ఉంటుంది.