కలర్ ఫోటో చేసిన మేలు బొంబాట్ పోగొట్టిందా..?

-

తెలుగమ్మాయి అయిన చాందినీ చౌదరీకి సినిమాల్లో అవకాశాలు చెప్పుకోదగినంతగా రాలేదు. లఘు చిత్రాల ద్వారా పాపులరిటీ సంపాదించుకున్న ఈ భామకి సినిమాల్లో అవకాశాలు అంతగా రాలేదు. వచ్చినా కూడా వాటిల్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ పెద్దగా లేవు. ఇలాంటి టైమ్ లో కలర్ ఫోటో చాందినీ చౌదరికి మంచి బ్రేక్ వచ్చింది. సుహాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు.

ఆహాలో రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అటు హీరో సుహాస్ కీ, ఇటు హీరోయిన్ చాందినీ చౌదరీకి పేరు తీసుకువచ్చింది. ఐతే ఈ సినిమా తర్వాత చాందినీ చౌదరీ మరో సినిమా బొంబాట్ కూడా రిలీజైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి సరైన స్పందన రావడం లేదు. అటు విమర్శకులు కూడా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సైంటిఫిక్ సినిమాగా రూపొందిన ఈ సినిమా చాందినీ చౌదరీకి మైనస్ గా మారింది. అయినా గానీ చాందినీకి అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. మరి కలర్ ఫోటోతో తెచ్చుకున్న ఇమేజ్ ని ఎలా కాపాడుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version