మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన నటన పరంగా , డాన్స్ పరంగా, కెరియర్ పరంగా ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో స్టార్ హీరో గా ఎదిగాడు. తెలుగు లో కమెడియన్ అల్లు రామలింగయ్య చిరంజీవి కూతురు ని సురేఖ ను వివాహం చేసుకొని ఒక వైపు అల్లు రామలింగయ్య అల్లుడు గా , మరొకవైపు నిర్మాతకు బావగా, మెగాస్టార్ గా పేరు సంపాదించారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా అప్పట్లో చౌదరీలు ఉండేవారు.
ఇప్పటికీ హీరోలు కానీ టెక్నీషియన్స్ గానీ డైరెక్టర్ కానీ ఎక్కువగా వారే ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్తున్న సమయంలో చిరంజీవి హీరోగా అప్పుడప్పుడే పైకి ఎదుగుతున్నాడు. అప్పటికే బాలకృష్ణ హీరోగా సినిమాలో నటిస్తున్నాడు. చిరంజీవి తప్ప మిగిలినవారంతా అప్పట్లో ఎక్కువగా *మ్మ వారే ఉండేవారు. చిరంజీవి నెమ్మదిగా రావడం పాపులారిటీ వస్తూ ఉండటంతో.. పెద్ద వాళ్లతో జాగ్రత్తగా లేకపోతే పైకి ఎదగడం చాలా కష్టమని అల్లురామలింగయ్య తెలియజేస్తూ ఉండేవారట. అలా ఒక్కొక్క మెట్టు చిరంజీవిని జాగ్రత్తగా ఎక్కిస్తూ ఉండేవారట అల్లు రామలింగయ్య.
ఇక ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ వరద ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లగా.. అదే సమయంలో చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సక్సెస్ మీట్ కి వెళ్లారు. ఇక అప్పుడు ఎన్టీఆర్ చిరంజీవి ఎదురు పడ్డారు.. ఇక అదే సమయంలో ఎన్టీఆర్ చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడుతూ ఏం బ్రదర్ మీ సినిమా తుఫాన్ లో కూడా కలెక్షన్ల తూఫాన్ సృష్టిస్తోంది అని ప్రశంసించారట. అయితే ఆరోజు రామలింగయ్య చేసిన తొలి ప్రయత్నం వల్ల నేడు చిరంజీవి మెగాస్టార్ గా కొనసాగుతున్నారు అని చెప్పవచ్చు.