వీరికి గుడ్‌న్యూస్: 5G టెస్ట్ బెడ్‌ను ప్రారంభించిన మోడీ

-

ప్రధాని నరేంద్ర మోడీ 5జీ టెస్ట్ బెడ్‌ను ప్రారంభించారు. ట్రాయ్ (టీఆర్ఏఐ) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా మంగళవారం 5జీ టెస్ట్ బెడ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘5జీ టెస్ట్ బెడ్‌లు దేశంలోని టెలికాం పరిశ్రమ, స్టార్టప్‌లకు మద్దతు ఇస్తుంది. దీంతో ఐదవ తరంలో ఉత్పత్తులు, నమూనాలు, పరిష్కారాలను ధృవీకరించవచ్చు. స్వీయ నిర్మిత 5జీ టెస్ట్ బెడ్ దేశానికి అంకితం చేయడం గర్వకారణం.’’ అని ఆయన పేర్కొన్నారు.

టెలికాం రంగంలో క్లిష్టమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్వీయ విశ్వాసం దిశగా ముఖ్యమైన అడుగు వేశామని మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్‌కు సహకరించిన ఐఐటీ సిబ్బందికి అభినందనలు తెలిపారు. 5జీ టెక్నాలజీని తయారు చేసేందుకు టెస్టింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన పరిశోధకులకు, యువకులకు, సంస్థలకు సూచించారు. కాగా, 5జీ టెస్ట్ బెడ్‌ను 8 ఇనిస్టిట్యూట్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దాదాపు 220 కోట్లకు పైగా ఖర్చు అయింది. ఈ 5జీ టెస్ట్ బెడ్ భారతీయ పరిశ్రమలు, స్టార్టప్‌లకు పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి, సాకేంతికతలో సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version