నరేష్ వల్లే ఆయన మొదటి భార్య చనిపోయిందా..?

-

ప్రముఖ సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీకే నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సినిమాలలో కంటే ఎక్కువగా మూడు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచాడు. అంతటితో ఆగకుండా ఇప్పుడు మరొక సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో నాలుగవ వివాహానికి సిద్ధమవుతూ ఉండడం నిజంగా ఈయన క్యారెక్టర్ ను అద్దం పడుతుంది అంటూ పలువురు నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోని నరేష్ మొదటి భార్య ఎవరు.. ?ఎలా చనిపోయింది? అనే విషయాలు ఇప్పుడు బాగా వైరల్ గా మారుతున్నాయి.

గత కొద్ది రోజులుగా నరేష్ పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. కానీ కొత్త ఏడాది సందర్భంగా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు ఒక వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఆ వీడియో పై కూడా జోరుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. అతడికి 60.. ఆమెకు 43.. ఇదెక్కడి పెళ్లి అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు. నిజానికి ముగ్గురు భార్యల బ్యాగ్రౌండ్ కూడా ఎక్కువే..నరేష్ మొదటి వివాహం చేసుకున్న అమ్మాయి ప్రముఖ డాన్స్ మాస్టర్ శ్రీను కుమార్తె కావడం విశేషం. రెండవ భార్య దేవులపల్లి కృష్ణ సీతారామ శాస్త్రి మనవరాలు రేఖా సుప్రియ. ఇక మూడవ భార్య ప్రముఖ రాజకీయవేత్త , మాజీ మంత్రి రఘువీరా రెడ్డికి తమ్ముడు కుమార్తె.

అయితే బయట ప్రపంచానికి తెలియని మరొక విషయం ఏమిటంటే నరేష్ మొదటి భార్య కన్నుమూయడానికి కారణం నరేష్ అని.. నిజానికి ఆమెకు విడాకులు ఇవ్వకుండానే రేఖా సుప్రియతో ప్రేమలో పడడంతో మొదటి భార్యతో వివాదం మొదలైంది. వీరిద్దరికీ నవీన్ కృష్ణ అనే కుమారుడు జన్మించాడు. రెండవ భార్యతో వివాహం జరిగిన వెంటనే.. నవీన్ కస్టడీ కోరుతూ కోర్టులో కేసు వేశాడు. నరేష్ కోర్టు కూడా నవీన్ ని తల్లి దగ్గర కాకుండా తండ్రి కి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. కట్టుకున్న భర్త మోసం చేయడం కడుపున పుట్టిన కొడుకు దూరం అవడంతో.. మానసికంగా అనేక ఇబ్బందులకు గురైన ఆమె మానసికంగా కృంగిపోయి మరణించింది.

Read more RELATED
Recommended to you

Latest news