మహేష్ బాబు సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా..?

-

శ్రీమంతుడు, మహర్షి , భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్న మహేష్ బాబు మరొకసారి కమర్షియల్ హీరో అనిపించుకున్నాడు. ఇక మహేష్ బాబు తాజాగా పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సుమారుగా రెండు సంవత్సరాల తర్వాత ఈ సినిమా రావడంతో ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా మహేష్ బాబు సినిమా ఈ రోజు విడుదలై ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఈరోజు ఉదయం ప్రీమియర్ షో వేయగా ఎలాంటి స్పందన లభించింది అనే విషయానికి వస్తే.. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని విలన్ గా బాగా నటించారు. ఇక మహేష్ బాబు స్టైలిష్ లుక్ కూడా ఒక ఫైట్ సీన్ లో ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత యూట్యూబ్ లో ట్రెండీ గా మారిన పెన్ని సాంగ్.. ఆ తర్వాత ట్రైలర్ లో చూపించినట్లుగానే కీర్తి సురేష్ అందంగా కనిపిస్తూ .. తన ఫన్నీ డైలాగ్ లతో ప్రేక్షకులను మెప్పించింది . ఇక మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మరింత కడుపుబ్బా నవ్విస్తాయి. మొత్తానికి హాస్యాన్ని బాగా పండించడంతో పాటు మహేష్ బాబు కామెడీ టైమింగ్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

సినిమా ప్రారంభంలో మహేష్ బాబు తండ్రి సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచే విధంగా ఉంటాయి. ఇక ఫ్రీ ఇంటర్వెల్ నుంచి కథలో మలుపులు.. కొత్త క్యారెక్టర్లు పరిచయం కూడా జరుగుతుంది . సముద్రఖని, మహేష్ బాబు మధ్య వచ్చే ఫైట్ సీన్స్ కథలో హీట్ పెంచుతాయి. ఇక ఫస్టాఫ్ మొత్తం చాలా హైలెట్గా, డీసెంట్ గా అనిపిస్తుంది . ఇక సెకండాఫ్ కి వచ్చేసరికి బ్యాంకులు, రుణాలు, EMI ల కు సంబంధించిన సీన్స్ అది కూడా ఎక్కువగా సాగదీసినట్లు కనిపిస్తోంది. ఫస్టాఫ్ లో ఎలాంటి కంప్లైంట్స్ లేనప్పటికీ సెకండాఫ్ లో దర్శకుడు ఇంకాస్త సన్నివేశాలపై దృష్టి పెట్టి ఉంటే సినిమా సూపర్ హిట్ అయి ఉండేది.

సెకండాఫ్ లో మహేష్ బాబు కి తగ్గట్టుగా ఒక్క సీన్ కూడా పడలేదు. కథ కూడా అంత బలంగా లేకపోవడం.. మహేష్ బాబు రేంజ్ కు తగ్గట్టుగా పరుశురాం ఎలివేషన్స్ ఇవ్వలేకపోవడం..అంతేకాదు మహేష్ బాబు పై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను దర్శకుడు అందుకోలేకపోయారు.. కథ పరంగా వీక్ గా ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా ఎలాంటి గ్రాస్ వసూలు చేస్తుందో తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే కలెక్షన్ల పరంగా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వచ్చు కానీ.. కథ పరంగా మిక్స్ టాక్ ను సొంతం చేసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version