వెంకీ కథ‌కు రాంచ‌ర‌ణ్ నో అన్నాడా…!?

-

నితిన్ హీరోగా నటించిన భీష్మ సినిమా మంచి విజయం సాధించింది.వరుస ఫెయిల్యూర్లతో డీలా పడిన యంగ్ స్టార్ నితిన్ ను మళ్ళీ తిరిగి సక్సెస్ బాట పట్టేలా చేసిన డైరెక్టర్ వెంకీ కుడుముల. భీష్మ సినిమా కన్నా ముందు ఛలో సినిమాను చిత్రీకరించాడు వెంకీ. అయితే ఛలో సినిమా కూడా బాక్స్ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది. ఛలో, భీష్మ చిత్రాలు రెండు వెంకీ కుడుముల కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ తర్వాత సినిమా ఏ హీరోతో చేస్తాడా అనే ఆలోచనలో ఉన్నారు అందరు. ఇప్పుడు తాజాగా ఒక హీరో పేరు వార్తల్లోకి వచ్చింది. అతను మరెవరో కాదు మెగా పవరస్టార్ రాంచ‌ర‌ణ్. చరణ్ తో సినిమా చేస్తున్నాడ‌ని అప్పట్లో కొన్ని వార్త‌లు కూడా వ‌చ్చాయి.

అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ వార్తల్లోకి ఎక్కారు.అదేంటంటే వెంకీ కుడుముల.. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తో కూడిన స్టోరీని చ‌ర‌ణ్ కి వినిపించాడ‌ని, అయితే ఈ క‌థ విన్న చరణ్ .. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో త‌న‌కు ఈ సినిమా సెట్ అవ్వ‌ద‌ని.. వెంకీ కుడుములకు చెప్పాడ‌ట‌. అంతే కాకుండా న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్ర‌ల‌పై దృష్టిపెట్టాల‌ని సూచించిన‌ట్టు టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం వెంకీ తన తర్వాత చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.. మరి ఈ డైరెక్టర్ ఏ హీరోను సెలెక్ట్ చేస్తాడు అన్నది వేచి చుడాలిసి ఉంది. లేదంటే చరణ్ కోసం మరొక విభిన్న కథ తయారుచేస్తాడో అన్నది చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version