ఆ తప్పే ఇలియానాకు సౌత్ లో అవకాశాలు రాకుండా చేసిందా..?

-

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తన అందంతో కరెంటు తీగ లాంటి నడుముతో యువతకు చెమటలు పట్టించిన ఈ ముద్దుగుమ్మ భారీ పాపులారిటీని కూడా దక్కించుకుంది.. టాలీవుడ్లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ పై మోజు పడి అక్కడికి వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయ్యింది. కానీ ఒక నిర్మాత వల్లే ఇలియానా సౌత్ కి దూరం అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టమో.. దాన్ని నిలుపుకోవడం కూడా అంతే కష్టం.. అయితే చాలామంది నటీనటుల విషయంలో ఇది నిజమని నిరూపితం కూడా అయింది. కొంతమంది సినిమాలలో స్టార్ నటులుగా ఎదిగి ఆ తర్వాత అవకాశాలు లేక ఫెడవుట్ అవుతారు. కానీ ఒక్కొక్కసారి వీరు చేసే తప్పిదాల వల్ల కూడా ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి ఉంటుంది. అలాంటి వారిలో ఇలియానా కూడా ఒకరు. ఏం జరిగింది అనే విషయానికి వస్తే ఇలియానా దేవుడు చేసిన మనుషులు సినిమా చేస్తున్న సమయంలో కోలీవుడ్లో విక్రమ్ హీరోగా ప్రొడ్యూసర్ నటరాజ్ నిర్మాణ సారధ్యంలో నందం అనే ఒక సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు.

అందుకు హీరోయిన్గా ఇలియానాను తీసుకొని.. ఈమెకు 40 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది.. దాంతో నిర్మాత నటరాజ్ డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె డబ్బులు ఇవ్వను కావాలంటే ఇంకో సినిమాలో నటిస్తానని చెప్పింది. దాంతో నటరాజ్ నడిగర్ సంఘం తో పాటు సౌత్ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఇలియానా పై ఫిర్యాదు చేశారు. వారు చెప్పినా ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో.. ఆమె డబ్బులు తిరిగి ఇచ్చేవరకు సౌత్ లో అవకాశాలు కల్పించకూడదు అని నిర్ణయించారు. అందుకే ఆమెకు సినిమాలలో అవకాశాలు రాకుండా పోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version