సీఎం జగన్‌…శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటోడు – శ్రీరెడ్డి

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తెలుగు అమ్మాయిలకు ఇవ్వడం లేదు అంటూ మా అసోసియేషన్ ముందు అర్ధ నగ్నంగా బైఠాయించి.. పాపులారిటీ దక్కించుకున్న శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు తనని చాలామంది అవకాశాల పేరుతో వాడుకున్నారు అని తనను శారీరకంగా వాడుకున్న వారి పేర్లు కూడా బయటకు పెట్టి మరొకసారి ఫేమస్ అయ్యింది.

అటు రాజకీయా విషయాల పై కూడా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారికి తన మాటలతో చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఇక తాజాగా సీఎం జగన్‌…శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటోడంటూ శ్రీరెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.

నిందలు శ్రీకృష్ణుడికి తప్పలేదు, ఓర్పు శ్రీ రాముడికి తప్పలేదని వెల్లడించారు. నిజాలు నిలకడ మీద తేలుతాయని…మీ వెనక దన్ను గా మీకు మేము వున్నాం జగన్ అన్న ..జై జగన్ అంటూ ఓ వీడియోను కూడా షేర్‌ చేసింది శ్రీ రెడ్డి. జగనన్న ఫాన్స్ అందరూ కూడా ఈ వీడియో ని తమ ఫేస్ బుక్స్ లో షేర్ చేయాలంటూ శ్రీ రెడ్డి తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version