బాలకృష్ణ సెంటిమెంట్ అక్కడి నుండే మొదలయిందా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నరసింహం బాలకృష్ణ పేరు పరిచయం అవసరం లేనిది. ఇక తన నటనతో సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా రాజకీయపరంగా కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాదిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు బాలకృష్ణ. ఇకపోతే ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ ఉన్నట్లుగానే ఈయనకి కూడా ఒక సెంటిమెంట్ ఉందట. ముఖ్యంగా ఆయనకు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి అంటే ఎంతో భక్తి .. అలాగే సెంటిమెంటు, నమ్మకం కూడా.. అందుకే ఆయన సినిమాలన్నీ కూడా సింహాచలేశుని పేరుతోనే వస్తూ ఉంటాయి.

ఇక సింహ భాగం బాలకృష్ణ సినిమాకు ఆ పేర్లే ఉండడానికి కారణం ఇదే అంటున్నారు ఇక్కడ భక్తులు.. విశాఖకు ఆయన వస్తే కచ్చితంగా సింహాచలం అప్పన్నని దర్శించుకోకుండా వెళ్లరు అని ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అయిన సింహాద్రి అప్పన్న కోరిన కోర్కెను తీర్చే బంగారు స్వామిగా భక్తుల నమ్మకం.. ఇక శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిగా సింహాచలంలో కొలువుదీరిన సింహాచలేశుడే ఈ స్వామి. ఇక బాలకృష్ణ సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చే టైటిల్ పేరు సింహ.. అందుకే ఆయన సినిమాలలో అన్నీ కూడా సింహ అని చివరి పదం వస్తుంది. ఇక అలా లక్ష్మీనరసింహ.. సమరసింహారెడ్డి, బొబ్బిలి సింహం, సీమ సింహం, సింహ ఇలా టైటిల్ ఉండేలాగా బాలకృష్ణ సినిమాలను ప్లాన్ చేసేలా చూస్తారు. అంతేకాకుండా ఇలా టైటిల్ తో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి విజయం సొంతం చేసుకోవడం గమనార్హం.

ఇకపోతే ఈ సినిమాలకు సంబంధించి రిలీజ్ కి ముందే స్క్రిప్ట్ గాని, డైరెక్టర్ గాని, నిర్మాతలు గాని సింహాద్రి అప్పన్న దర్శకం చేసుకుంటారట. ఇకపోతే ఒక చిన్న సీనైనా సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరిగేటట్టు చూసుకుంటారట. ఇక అంతలా బాలకృష్ణకు అంతలా నమ్మకం , సెంటిమెంట్ ఏర్పడిందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version