బొల్లి మచ్చలు వచ్చాయా .. అయితే ఆ లోపం వల్లేనా..?

-

శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది.. అన్ని అవయవాల్లో చర్మం చాలా పెద్దది. చాలా సున్నితంగా ఉంటుంది. కేవలం రెండు నుంచి మూడు మిల్లీమీటర్ల బంధం కలిగి ఉంటుంది. అయితే చర్మం పై ఉండే లేత తెల్లటి మచ్చలను మనం బొల్లి అని పిలుస్తాము. దీర్ఘకాలికంగా ఉండే ఈ వ్యాధి ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మన శరీరంలో రోగనిరోధక శక్తికి సంబంధించిన కణాలు మెలనోసైట్స్ కణాల మీద దాడి చేయడం వల్ల బొల్లి మచ్చలు ఏర్పడతాయి. చర్మంపై మెలనిన్ కణాలు తగ్గడం వల్ల ఇది కలుగుతుంది.

బొల్లి మచ్చలు ఉన్నవారు కొన్ని అపోహలకు గురవుతుంటారు. కానీ వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చర్మం ఇప్పుడు చెబుతున్నారు. బొల్లి అనేది పాలు, క్రీమ్ వంటి ఆహార పదార్థాలు తినడం వల్ల వస్తుంది అని ప్రజలు విశ్వసిస్తారు. కానీ ఇది అపోహ మాత్రమే.. బొల్లి అనేది మనం తీసుకునే ఆహారానికి సంబంధించింది కాదు తినే ఆహారం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా బొల్లి మచ్చలు ఏర్పడవు. ముఖ్యంగా 20 సంవత్సరాల లోపు ఉండే వ్యక్తి చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడి అవకాశం ఉంది ఒక్కో సందర్భంలో ఇది వృద్ధాప్యంలో కూడా సంభవించవచ్చు.

ప్రస్తుతం ఉన్న కాలంలో అలోపతిలో కానీ, ఆయుర్వేదంలో కానీ మంచి వైద్యం వుంది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఇటువంటి తెల్ల మచ్చలకు వాత,పితా,కఫా దోషాలే ఈ వ్యాధి కారణమని చెబుతారు.ఈ వ్యాధి ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ తెల్ల మచ్చలు శరీరం మొత్తం వ్యాపిస్తాయో అది చాలా ప్రమాదమైన స్థితి అని చెప్పవచ్చు.చాలా తక్కువ సమయంలో శరీరంలో అన్ని భాగాలకు వ్యాధి రావచ్చు.కాబట్టి మొదటి దశలోనే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం అని గుర్తించాలి.

Read more RELATED
Recommended to you

Latest news