ప్రభాస్ అన్ స్టాపబుల్ ప్రోమో అదుర్స్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

-

రెండు తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తెరకెక్కిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న ఈయన భారత సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగా మీడియా ముందుకు రావడానికి ఎప్పుడు ఇబ్బంది పడే ప్రభాస్ ఇప్పుడు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాబోతున్నారు.

ఇప్పటికే ఈ ఎపిసోడ్ నుంచి విడుదలైన గ్లింప్స్, ప్రోమో, పోస్టర్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఈ ఎపిసోడ్ ను థియేటర్లలో కూడా విడుదల చేయాలని అభిమానులు తెగ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పుడు ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో ని విడుదల చేసి ఒక ట్విస్ట్ కూడా పెట్టారు. ట్విస్ట్ ఏమిటంటే ఈ ఎపిసోడ్ ఒకేరోజు కాకుండా రెండు పార్ట్ లుగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రోమో ద్వారా వెల్లడించారు.

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రభాస్, గోపీచంద్ గెస్ట్లుగా వచ్చిన ఈ ఎపిసోడ్ ను రెండు పార్ట్ లుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. డిసెంబర్ 30న పార్ట్ వన్.. రెండో పార్ట్ జనవరి 6వ తేదీన రిలీజ్ చేయనుండగా పార్ట్ 1 కి సంబంధించి సర్ప్రైజ్ ప్రోమోనో తాజాగా ఆహా విడుదల చేసింది. ఇందులో సెటైర్లు, సీక్రెట్లు, సరదాలు, సలహాలు, డాన్సులు , సంచలనాలు అన్నీ ఉన్నాయి అని ట్వీట్ చేసింది. మరి ఆ ప్రోమో కూడా ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. ఆ ప్రోమోను మీరు కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news