ఓటరు కార్డులో మార్పులని చెయ్యాలనుకుంటున్నారా…? అయితే ఇలా చేసేయండి..!

-

మీ ఓటరు కార్డు లో ఏమైనా తప్పులు ఉన్నాయా..? పేరు, ఎడ్రస్ ఇలా ఎందులోనైనా తప్పులు ఉన్నాయంటే ఇలా మార్చేయండి. అది కూడా ఇంట్లో నుండే. దీని కోసం స్మార్ట్‌ఫోన్ లేదా ఇంట్లో కంప్యూటర్ ఉంటే చాలు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ https://www.nvsp.in/ కి వెళ్లి సులువుగా మార్పు చెయ్యొచ్చు. ఎలా మార్చాలనే విషయానికి వస్తే.. ముందు మీ బ్రౌజర్‌లో https://www.nvsp.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

ఆ తరువాత హోమ్ పేజీలో ఎడమవైపు ‘Login/Register‘ అని ఓ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి. ఇప్పుడు మీరు కొత్త యూజర్ అయితే ‘Register as New user‘ ఆప్షన్‌ మీద క్లిక్ చేసేయండి. మీ మొబైల్ నెంబర్ ద్వారా అకౌంట్ రిజిస్టర్ చేసుకున్నాక… క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయండి. ఆ తర్వాత Send OTP పైన క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చెయ్యాలి. వెరిఫై చేసిన తర్వాత మీ ఓటర్ ఐడీ కార్డు నెంబర్ ని ఎంటర్ చేయండి. పాస్‌వర్డ్ పెట్టుకున్నాక అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ‘Click on Correction in Personal Details’ పై క్లిక్ చెయ్యండి.

రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం సెలెక్ట్ చేసాక వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ ఐడీ వస్తుంది. రిఫరెన్స్ ఐడీ తో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. https://www.nvsp.in/ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ స్టేటస్‌ను చెక్ చెయ్యొచ్చు. ‘Track application Status’ పైన క్లిక్ చేసి… ఆ తర్వాత ‘Enter reference id’ దగ్గర మీ రిఫరెన్స్ ఐడీ ఎంటర్ చేసాక.. ‘Track Status’ బటన్ ‌పై క్లిక్ చేయండి దరఖాస్తు స్టేటస్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version