ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న బాదుడు కార్యక్రమాల వల్ల ప్రజలు అల్లడిపోతున్నారని టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు మండిపడ్డారు. ఇప్పటికే చెత్త, ప్రాపర్టీలపై పన్ను వేస్తున్న వైసీపీ ప్రభుత్వం విద్యుత్, బస్సు ఛార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే ఇక్క సారి బస్సు ఛార్జీలు పెంచిన జగన్… ఇప్పుడు డిజిల్ సెస్ పేరుతో ఇప్పుడు మరోసారి ఛార్జీలు పెంచడం అన్యాయం అని అన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత లాభ నష్టాలను ప్రభుత్వమే భరించాలని అన్నారు. కానీ ఇలా రాష్ట్ర ప్రజలపై భారం మోపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం పెంచిన డిజిల్ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు డిమాండ్ చేశారు. డిజిల్ సెస్ ను తగ్గించాలని డిమాండ్ చేస్తు.. టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.