ఇక నుంచి ఇంటి వద్దకే డీజిల్ వస్తోంది. పంపుల వద్ద గంటల తరబడి నిల్చొవలసిన అవసరం లేదు. దేశంలోనే తొలిసారి డీజిల్ డోర్ డెలివరీ సదుపాయం ఈ కార్యక్రమం వరంగల్ జిల్లాలో మొదలైంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) తో కలిసి రామ్స్ మూవింగ్ టెక్నాలజీస్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకోసం ఓ మొబైల్ యాప్, ఓ వాహనాన్ని సిద్ధం చేశారు. ఎస్-పెట్రోల్ పేరుతో రూపొందించిన యాప్, వాహనాన్ని బీపీసీఎల్ (తెలంగాణ) మేనేజర్ వై.శ్రీనివాస్ నిన్న ప్రారంభించారు. ఎన్-పెట్రోల్ అనే మొబైల్ యాప్ ద్వారా వినియోగాదారులు డీజిల్‌ను ఆర్డర్ చేస్తే వారు సూచించిన చిరునామాలో డెలివరీ చేస్తారు. రానున్న మంగళవారం నుంచి అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా కనీసం 60 లీటర్లు, అత్యధికంగా 6000 లీటర్ల వరకు డీజల్‌ను ఆర్డర్ చేయవచ్చు.