పొట్ట చుట్టూ కొవ్వుని ఇలా తగ్గించుకోండి..!

-

చాలా మందికి పొట్ట చుట్టూ ఎక్కువగా కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. అటువంటి వాళ్ళు దాన్ని తగ్గించుకోవాలి. లేదంటే సమస్యలు వస్తాయి. అయితే పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకు పోయినట్లయితే ఈ చిట్క ని ఫాలో అవ్వండి. ఇలా చేయడం వల్ల త్వరగా పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోతుంది. ఈ మధ్య కాలం లో బయట ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు, కొవ్వు పెరిగి పోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి.

అయితే పొట్ట చుట్టూ కొవ్వు అధికంగా ఉండే వాళ్ళు వెల్లుల్లి తో సమస్యను పరిష్కరించుకో వచ్చు. వెల్లుల్లి నీళ్లలో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్-సి, విటమిన్ బి6, కాల్షియం వంటి పదార్థాలు ఉంటాయి అలానే బరువుని కంట్రోల్ చేస్తుంది. వెల్లుల్లి నీరు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే వెల్లుల్లి నీళ్ళని తీసుకోవడం వలన బరువు తగ్గొచ్చు.

ఇది కడుపుని నిండుగా ఉంచుతుంది. దీనితో ఆకలి కూడా వేయదు. అదే విధంగా అజీర్తి సమస్యలు కూడా తొలగించుకోవచ్చు. ఇక వెల్లుల్లి నీళ్ళని ఎలా తయారు చేయాలి అనేది చూస్తే.. ముందుగా వెల్లుల్లి తీసుకుని వేడి నీళ్ల లో వేయండి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో నిమ్మరసం వేసి కొద్దిగా తేనె వేసి దీనిని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన బరువు తగ్గచ్చు అలానే పొట్ట చుట్టూ వుండే కొవ్వు కూడా కరిగిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version