ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు బి.ఆర్ స్టేడియం లో సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ , మైనార్టీలు నిర్వహించిన సింహగర్జన సభకు ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మాట్లాడుతూ …రాష్ట్రంలో సీఏఏ అమలు చేయకుండా సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ప్రధాని మోడీ ని చూసి జగన్ భయపడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి ప్రారంభం కానున్న ఎన్‌పీఆర్ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్‌లో నిలుపుదల చేసేందుకు సిద్ధం కావాలన్నారు. ఎన్‌పీఆర్‌ను నిలిపివేయడం అత్యవసరం… ఇవాళ వైఎస్సార్ బతికుంటే… ఎన్‌పీఆర్‌ను రెండు నిమిషాల్లో ఆపేసే వాళ్ళు అని పేర్కొన్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి చాలా ధైర్యవంతుడు జగన్ పిరికివాడు అదే తేడా అంటూ …కేసుల గురించే జంకుతున్నాడు అన్నట్టు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌పీఆర్ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ నిలిపి వేయకపోతే..మేమే బహిష్కరిస్తామని దాన్ని మేము స్వాగతించబోం… అని తేల్చి చెప్పారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ మైనారిటీ ఎమ్మెల్యేలు కూడా అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు సపోర్ట్ చేశారు.