తాను గెలిచిన సింబల్ ఫ్యాన్. తనకు బీ ఫాం ఇచ్చిన నేత జగన్. తాను ఎంపీగా నిలిచింది గెలిచింది ఇప్పటికీ పార్లమెంటులో కుర్చోగలగడానికి కారణమైంది వైఎస్సార్సీపీ! సరే.. ఆయన దృష్టిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ! ఆ పార్టీకి అధినేత వైఎస్ జగన్! వైఎస్ జగన్ పార్టీలో గెలుపొందిన 23 మంది ఎంపీల్లో ఆయన ఒకరు! అవన్నీ మరిచారో ఏమో తెలియదు కానీ.. ఏరు దాటాక బోడి మల్లన్న చందంగా.. తనవల్లే తాను గెలిచానని చెప్పుకొస్తున్నా ఆర్.ఆర్.ఆర్. తాజాగా వైకాపా నేతలకు సవాల్ విసిరారు!
అవును… తనవల్లే, తన ఫోటో వల్లే ఇంతకాలం గెలవకపోయినా ఈ సారి మాత్రం గెలిచానని చెప్పుకొస్తున్నారు వైకాపా ఎంపీ రఘురామకృష్ణం రాజు! సరే ఈ ఓడ మల్లన్న ఓడి మల్లన్న కబుర్లు తెలిసినవే కాబట్టి కాసేపు అవి లైట్ తీసుకుంటే… ఇప్పుడు వైకాపా నేతలకు సవాల్ విసరానని, అందుకు వారు తోకముడిచారని చెప్పుకొస్తున్నారు ఆర్.ఆర్.ఆర్!
ఫ్యాన్ గుర్తుపైనా, జగన్ కష్టంపైనా, వైకాపా కార్యకర్తల త్యాగాలపైనా గెలిచిన రఘురామ కృష్ణం రాజు… అమరావతి రాజధాని కొనసాగింపు రిఫరెండంగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని తాను సవాలు విసిరానని.. కాని తన సవాలుకు స్పందించకుండా వైసీపీ నేతలు తోక ముడిచారని ఎద్దేవా చేస్తున్నారు! ఇంతకూ ఆర్.ఆర్.ఆర్. కోరిన సవాల్ కేవలం నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికే అయితే.. దానికి వైకాపా నేతల అనుమతి ఎందుకో ఆర్.ఆర్.ఆర్. కే తెలియాలి.
నిజంగా రాష్ట్రంలోని ప్రజలంతా మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని, కేవలం అమరావతినే కోరుకుంటున్నారని అంతా నమ్మకం ఉంటే… నేరుగా వైకాపా వల్ల తనకు దక్కిన ఎంపీ సీటుకు రాజీనామా చేసేసి, ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి.. తన సిసలైన ధమ్ము చూపించొచ్చు కదా అనేది ఆయన అభిమానుల సూచన! అలా చేస్తే ఆర్.ఆర్.ఆర్. లెవెల్ మరో రేంజ్ కి వెళ్లిపోతుంది కదా అనేది వారి ఆశ! జగన్ ని ఎదుర్కొని గెలీన ధమ్మున్న లీడర్ గా ఆర్.ఆర్.ఆర్. దేశవ్యాప్తంగా పాజిటివ్ గా ఫేమస్ అవుతారు కదా అనేది వారి బలమైన నమ్మకం!
మరి రఘురామకృష్ణం రాజు ఆ దిశగా ఆలోచిస్తారా? లేక వైకాపా నేతలు తోకలు ముడిచారు.. తాను కూడా వైకాపా ఎంపీనే కాబట్టి ఈ అభిమానుల డిమాండ్ విషయంలో తాను కూడా తోక ముడుస్తానని ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి!!