మాజీ మంత్రులకు సీటు కష్టాలు..!

-

ఎప్పుడైతే తాడికొండ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉండగానే,. అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని పెట్టారో, అప్పటినుంచి కొందరు వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైపోయింది…తమ నియోజకవర్గాల్లో కూడా సమన్వయకర్తలని పెడితే తమ సీటు పోతుందనే భయం పెట్టుకున్నారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పనితీరు పెద్దగా బాగోని సంగతి తెలిసిందే..ఆమెపై వ్యతిరేకత ఎక్కువ ఉంది. దీంతో నెక్స్ట్ ఆమె మళ్ళీ గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి.

అందుకే జగన్ తాడికొండలో అదనపు సమన్వయకర్తగా డొక్కాని పెట్టారు. అంటే నెక్స్ట్ తాడికొండ సీటు డొక్కాకే అని పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఒక్క ఈ నియోజకవర్గంలో మార్పు దెబ్బకు మిగిలిన స్థానాల్లో ఎమ్మెల్యే టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలు ఎక్కువ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో కొందరు మాజీ మంత్రులకు కూడా సీటు కష్టాలు తప్పేలా లేవు.

ఇప్పటికే మంత్రి వర్గం నుంచి తప్పించడంతో చాలామంది మాజీ మంత్రులు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో నెక్స్ట్ సీటు కూడా ఇవ్వకపోతే వారి పరిస్తితి ఎలా ఉంటుందో ఊహించ్కోవచ్చు. అయితే నెక్స్ట్ కొందరు మాజీ మంత్రులకు సీటు ఇవ్వకపోవడం గాని, లేదా సీటు మార్చడం గాని జరుగుతుందని తెలుస్తోంది. ఇటీవల వస్తున్న కొన్ని సర్వేల్లో కొందరు ఎమ్మెల్యేలకు నెక్స్ట్ సీట్లు దక్కడం కష్టమని తేలింది. ఆ లిస్ట్‌లో కొందరు మాజీ మంత్రులు కూడా ఉన్నారు.

కాకినాడ రూరల్, ఏలూరు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు సర్వే వచ్చింది…అలాగే ఈ స్థానాల్లో అదనపు సమన్వయకర్తని నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిసింది. అయితే కాకినాడ రూరల్ నుంచి కన్నబాబు, ఏలూరు నుంచి ఆళ్ళ నాని, విజయవాడ పశ్చిమ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు మాజీ మంత్రులే. పైగా సీనియర్లు…మరి వీరికి నెక్స్ట్ సీటు డౌట్ అనే పరిస్తితి. లేదా సీనియర్లు కావడంతో వీరిని వేరే సీట్లలోకి మారుస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version