వరుడు కావలెను : “దిగు దిగు దిగు నాగ” జానపద పాట విడుదల

-

యంగ్‌ టాలీవుడ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న సినిమా వరుడు కావలెను. సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా… లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు మరియు టీజర్లకు ఓ రేంజ్‌ లో రెస్పాన్స్‌ వచ్చింది. లుక్‌ పరంగా హీరో నాగశౌర్య మరియు హీరోయిన్‌ రీతూ వర్మ ఇద్దరూ కూడా మంచి మార్కులు కొట్టేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ వరుడు కావలెను సినిమా నుంచి మరో అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి ఓ అందమైన జానపద లిరికల్‌ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ”దిగు దిగు దిగు నాగ” అంటూ ఈ పాట ఎంతో అద్భుతంగా సాగుతుంది. తెలంగాణ ”దిగు దిగు దిగు నాగ” అనేది చాలా పాపులర్‌ అయిన జానపద గీతం. ఈ పాటను ఆ లైన్‌ తో మొదలు పెట్టి.. అదే బానీలో సినిమా సాహిత్యాన్ని అల్లారు. ఇక తమన్‌ స్వరపరిచిన ఈ పాటకు అనంత్‌ శ్రీరాం సాహిత్యాన్ని అందించగా.. శ్రేయ ఘోషల్‌ పాట అందుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news