చిత్ర పరిశ్రమ, జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ల మధ్య సినిమా టికెట్ల వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. హీరో నాని ఏపీ ప్రభుత్వంపై కామెంట్స్ చేయగా.. నానికి మద్దతుగా.. దిల్ రాజు నిలిచాడు. తాజాగా దిల్ రాజ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే అలాగే కనిపిస్తాయి. హీరో నాని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. నాని చెప్పిన విషయం వేరు.. అది వెళ్లిన తీరు వేరన్నారు దిల్‌రాజు.
సినీ పరిశ్రమ కు ,ప్రభుత్వానికి మా విన్నాపాలు అని… సినీ పరిశ్రమ తరపున అన్నీ విభాలగాల తరపున ఓ కమిటి ని ఫామ్ చేశారన్నారు. ఆ కమిటీ వెళ్లి ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వెళ్లనున్నారని దిల్ రాజ్ ప్రకటన చేశారు. ఈ లోపు ఎవరు ఏ విధమైన కామెంట్స్ చేయవద్దని కోరారు. తెలంగాణా ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను పెంచినందుకు ధన్యవాదాలు చెప్పిన దిల్ రాజు… జగన్ ప్రభుత్వం కూడా అదే ఎంకరేజ్ మెంట్ ఉంటుందని ఆశిస్తున్నామని సైలెంట్ గా చురకలు అంటించారు. సీఎం జగన్ అపాంట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు దిల్ రాజు.