తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత తెలంగాణ లో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. కాగ గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఎప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచుతారో తెలియలేదు.
కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంతో గృహ అవసరం కోసం ఉపయోగించే విద్యుత్ కనెక్షన్ల కు ప్రతి యూనిట్ కు 50 పైసల చొప్పున ఛార్జీలు పెరగనున్నాయి. అలాగే హెటీ కోసం ఉపయోగించే విద్యుత్ కనెక్షన్లకు ప్రతి యూనిట్ కు రూ. 1 చొప్పున ఛార్జీలు పెరగనున్నాయి. కాగ కేంద్ర ప్రభుత్వం తీసుకుస్తున్న నూతన విద్యుత్ విధానాల వల్లే ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి.