థియేటర్లు సరిపోవడం లేదంటే… మరో సినిమాని తీసుకొస్తున్న దిల్ రాజు..!

-

ఈసారి సంక్రాంతి బరిలో పెద్ద మూవీస్ ఉన్నాయి. తెలుగు సినిమాలకి థియేటర్లు పంచడంతో వివక్ష క్లియర్ గా కనపడింది. గుంటూరు కారం, హనుమాన్ ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి గుంటూరు కారం సినిమాకి దిల్ రాజు నైజాం ఏరియాలో 90 శాతం థియేటర్లు లాక్ చేసినట్లు తెలుస్తోంది. హనుమన్ సినిమాకి థియేటర్లు దొరకట్లేదని నిర్మాతలు చెప్తున్నారు. నా సామిరంగా వంటి పెద్ద హీరోల సినిమాలు కూడా ఈసారి సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. రవితేజ ఈగల్ సినిమాని వాయిదా వేసేటట్టు కనపడుతుంది. అయితే తెలుగు సినిమాలే వెనక్కి వెళ్తుంటే డబ్బింగ్ సినిమాని బరిలోకి తీసుకువచ్చేటట్టు కనబడుతోంది.

దిల్ రాజు సంక్రాంతికి ఒక డబ్బింగ్ సినిమాని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మన తెలుగు సినిమాలకే దిక్కు లేదంటే డబ్బింగ్ సినిమాలను ఎవరు చూస్తారని గతం వారం దిల్ రాజు అన్నారు కానీ ఇప్పుడు దిల్ రాజు శివ కార్తికేయన్ అయలాన్ సినిమాని తెలుగులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది అది కూడా గుంటూరు కారం, హనుమాన్ సినిమాకి పోటీ గానే, ఈ టైంలో అలా నైజాం హక్కులు కొనడంతో అందరి దృష్టి రాజు మీద పడింది మరి సినిమాకి థియేటర్లు ఎలా సర్దుతారో చూడాలి హనుమన్ సినిమాకి ఇచ్చిన థియేటర్ ని తీసేసుకుంటారేమో అని అంతా అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version