కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలకి వినూత్న అనుభవం ఎదురయింది. ఒడిస్సా పర్యటనలో ఇది చోటు చేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు పురుషోత్తం. చిలుక సరస్సులో పడవలో ఆయన బయలుదేరారు. పడవ దారి తప్పడంతో చిక్కుకుపోయింది. చేపలు పట్టడానికి మత్స్యకారులు వేసిన వల అడ్డు పడి సరస్సులో పడవ చెక్కకు పోయింది. రెండు గంటల పాటు సరస్సు లోని ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత బయటకు వచ్చానని కేంద్రమంత్రి చెప్పడం జరిగింది. 11వ విడత సాగర్ పరిక్రమ పథకంలో భాగంగా కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఒడిస్సాలో వరుసగా సమావేశాలని నిర్వహిస్తున్నారు. ఈ క్రమం లోనే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు చిలుకా సరస్సులోని ఒక పడవలో కేంద్ర మంత్రులతో పాటుగా ఆయన సిబ్బంది అధికారులు బయలుదేరారు. పడవ నడిపే వ్యక్తికి మార్గం కొత్త, చీకటి కావడంతో ఇలా జరిగిందని తెలుస్తోంది. పడవ గమ్యాన్ని చేరకపోవడంతో ఒడ్డున ఉన్న అధికారులు అప్రమత్తమయ్యారు. నెమ్మదిగా బయటకి చేర్చారు.