డీసీపీతో వివాదంపై డింపుల్‌ హయతి కీలక వ్యాఖ్యలు

-

మే 14న రాహుల్ హెగ్డే కారును తన కారుతో ఢీకొట్టడంతో పాటు కాలితో తన్నుతూ వీరంగం సృష్టించారు డింపుల్ హయతి, డేవిడ్. దీనిపై ప్రశ్నించిన రాహుల్ హెగ్డే డ్రైవర్‌తోనూ ఆమె గొడవకు దిగింది. దీంతో డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు డింపుల్, డేవిడ్‌లపై ఐపీసీ సెక్షణ్ 353, 341, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. సోమవారం వీరిద్దరిని అదుపులోకి తీసుకుని.. 41 (ఏ) కింద నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది.

ఇది ఇలా ఉండగా డింపుల్ హయతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన మీద తప్పుడు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను డీసీపీని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేసింది. డీసీపీనే తన కారు కోసం అపార్ట్ మెంట్ లోకి ట్రాఫిక్ కోన్స్ ను తెచ్చి పెట్టారని డింపుల్ హయతి ఆరోపించింది. పబ్లిక్ ప్రాపర్టీ తీసుకువచ్చి ప్రైవేట్ ప్రాపర్టీలో పెట్టారని, ట్రాఫిక్ కోన్స్ ను ప్రైవేట్ అపార్ట్ మెంట్ లో ఎలా పెడతారని ప్రశ్నించింది. తన కారుతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టలేదని వెల్లడించింది. డీసీపీ కారుకు ఎక్కడైనా ప్రమాదం జరిగి ఉండొచ్చని, నా కారుతో ఢీకొడితే రెండు కార్లకు డ్యామేజి ఉండాలి కదా అని డింపుల్ హయతి ప్రశ్నించింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version