తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సర్పంచుల సంఘం హ‌ర్షాతిరేకాలు

-

గ్రామ పంచాయ‌తీల‌కు రూ.1190 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు, పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావులు నిన్న ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారితో భేటీ అయ్యారు. ఈ రోజు ఇద్ద‌రు మంత్రులు స‌మావేశ‌ం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయ‌తీల్లో వివిధ ప‌నుల‌కు సంబంధించి నిధుల విడుదలపై చ‌ర్చించారు. రూ.1190 కోట్ల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు సంబంధిత అధికారుల‌తో మాట్లాడి వెంట‌నే ఆ నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని ఆదేశించారు.

ఈ నిధుల‌ను విడుద‌ల చేయ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్పంచ్‌ల‌లో హ‌ర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల స‌ర్పంచ్ ల సంఘం ప్రతినిధులు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావును హైద‌రాబాద్ లోని మంత్రుల నివాసంలో క‌లిసి సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు.. సీఎం కేసీఆర్‌ తోపాటు, మంత్రులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, హ‌రీశ్ రావుకు కృత‌జ్ఞత‌లుతెలిపారు. సీఎం కేసీఆర్ మ‌న‌సున్న మ‌హారాజని కొనియాడారు. మాట త‌ప్పకుండా, అంద‌రి శ్రేయోభిలాషిగా ఆలోచిస్తున్నార‌ని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రగ‌తిని దృష్టిలో పెట్టుకుని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నిధులు విడుద‌ల చేస్తూ అభివృద్ధిని నిరాటంకంగా కొన‌సాగిస్తున్నార‌ని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version