Republic Pre Release Event: మ‌ళ్లీ అత‌డే నాకు లైఫ్ ఇచ్చాడు : డైరెక్టర్ దేవా కట్టా ఎమోష‌న‌ల్ కామెంట్స్..

-

Republic Pre Release Event: ప్రస్థానం సినిమాతో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్ట‌ర్ దేవాక‌ట్టా (Deva Katta), మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్(Sai Dharam Tej) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ పొలిటికల్ డ్రామా రిపబ్లిక్ (Republic). మొదటినుంచి ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌కి జోడీగా ఐశ్వర్య రాజేశ్ నటించింది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 1న విడుద‌ల కానున్న‌ది.

 

ఈ మూవీకి సంబంధించిన‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‏ను శ‌నివారం సాయంత్రం జ‌రిగింది. ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాగా.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని, ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. డైరెక్టర్ దేవా కట్టా సెన్సెష‌ల్ కామెంట్స్ చేశారు. సాయితేజ్ కోసం.. పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్ కు రావ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని ప్ర‌త్యేక కృతజ్ఞతలు తెలిజేశారు.
ఈ క‌థ సినిమాగా తెర‌కెక్క‌డానికి ప్ర‌ధాన కార‌ణం తేజ్‌నేన‌ని అన్నారు.

ప్రస్థానం తర్వాత తాను చేసిన తప్పుల వలన తెలుగు ఇండస్ట్రీలో త‌న‌పై నమ్మకం పోయింది. అలాంటి స‌మ‌యంలో త‌న క‌థ‌ను ఎవ‌రూ కూడా విన‌డానికి ముందు రాలేద‌ని బాధ‌ప‌డ్డారు. కేవ‌లం సూచ‌న ప్రాయం చేపిన ఓ ఐడియాకే ఆయన క‌నెక్ట్ అయ్యారు. సర్ ఈ కథ నాతోనే చేస్తానని ప్రామిస్ చేయ్య‌డ‌ని అన్నాడు.
ఆయ‌న క‌న్ఫిడేన్స్ తో ఈ సినిమా చేయడానికి ముందు వ‌చ్చాన‌ని తెలిపారు. ఆ రోజు నుంచి ఈ సినిమాకు తేజూ సైనికుడిలా నిలిచాడు. బ్రదర్ తేజ్..త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు డైరెక్ట‌ర్ దేవా క‌ట్టా.

ఈ సినిమా క‌థ విన్న ప్రొడ్యూస‌ర్లు త‌న మీద పూర్తి నమ్మ‌కం ఉచ్చార‌నీ, క‌నీసం ఫస్ట్ కాపీ చూపించేవరకూ కనీసం వాళ్లు ఎడిట్ రూంలోకి కూడా రాలేదని అన్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే అందరూ కారకులు .. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం తానే బాధ్యుడ‌ని ఎమోష‌న‌ల్ అయ్యారు. ఎందుకంటే పరిపూర్ణంగా త‌ను విజన్ తో త‌న‌ని ప‌ని చేయనిచ్చారు అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news