ఆ డైరెక్టర్ పెద్ద *** శాడిస్ట్..!!

-

సినిమా ఛాన్స్ ల కోసం  అమ్మాయిలు పడే ఆరాటంను క్యాష్ చేసుకోవడానికి చాలా మంది ఇండ్రస్టిలో  గోతి కాడ నక్కలా ఎదురుచూస్తూ వుంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువుగా కొత్త నటీ నటులతో సినిమా ప్లాన్ చేస్తుంటారు. కొత్త వాళ్ల లో ఛాన్స్ కావాలని మగవాళ్ళు వస్తే హీరో ఛాన్స్ ఇస్తామని డబ్బులు వసూలు చేస్తారు. అదే అమ్మాయిలు వేస్తే డబ్బులు అడగకుండా కమిట్ మెంట్ అడుగుతారు.కొంత మంది తెలివిగా ముందు ఏమి అడగకుండా , షూటింగ్ మధ్యలో నువ్వు సరిగా యాక్టింగ్ చేయడం లేదు  నిన్ను తీసేస్తా అని బెదిరించి కోరిక తీర్చుకుంటారు.

 

కొన్ని సార్లు షూటింగ్ ఆపేస్తే తన కెరియర్ నాశనం అవుతుంది అని చాలా మంది అమ్మాయిల లొంగిపోతారు. ఎందుకంటే వారు ఇల్లు విడిచి వచ్చింది దీనికోసమే అని బాధను దిగమింగుకుంటారు. కొంత మంది మాత్రం వారు ఎంత హింసించినా కూడా ఒప్పుకోరు .ఇలాంటి అనుభవం మన తెలుగు హీరోయిన్ మాధవి లత కు ఎదురు అయ్యిందట. అది తన మొదటి సినిమా కావడంతో ఏంతో అనందం గా సెట్లోకి అడుగుపెట్టిందట ,మొదటి మూడు రోజుల షూటింగ్ బాగానే గడిచి పోయింది అని చెప్పింది..

తర్వాత రోజు నుండి అసలైన హింస మొదలయ్యింది అని చెప్పుకొచ్చింది. ముందుగా వంకర చూపులు చూడడం, తర్వాత దగ్గరగా వచ్చి కావాలని ముట్టుకోవడం, హీరో చేసే పనులు మొత్తం ముందు ఆయనే స్వయంగా చేసి చూపించే వాడని, ఇబ్బందిగా అనిపించినా తట్టుకొని వున్ననని చెప్పింది. సాయంత్రం అయితే నా రూమ్ కి రమ్మని, డిస్కస్ చేయాలని ఇన్ డైరెక్ట్ గా చెప్పేవాడని వాపోయింది. వినక పోయే సరికి అందరి ముందు అవమానించడం, కనీస సౌకర్యాలు కల్పించ కుండా వేధిస్తూ ఆనందపడే వాడని తెలిపింది. చివరకు ఎలాగోలా అతని వల్లో పడకుండా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version