“పుష్ప 2” లో మిల్కీ బ్యూటీ ఐటమ్ సాంగ్ ?

-

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమా పార్ట్‌ 1 బంపర్‌ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా చేయకపోయినా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాను చాలా గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు సుకుమార్.

అయితే.. ఈ సీక్వెల్ లో కూడా ఓ అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ లో చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది అంటూ పుకార్లు వినిపించాయి. మధ్యలో కొన్నాళ్లు బాలీవుడ్ బ్యూటీ సీనియర్ ఐటమ్ హీరోయిన్ మలైకా అరోరా కనిపించబోతున్నట్లు టాక్ నడిచింది. అయితే ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తోంది. ఈ సాంగ్ గిరిజన నేపథ్యంలో సాగుతుందని పేరుకి ఐటమ్ సాంగ్ అయినా కథలో భాగం అని తెలుస్తోంది. అందుకే, ఈ సాంగ్ లో తమన్నాను తీసుకోవాలనే ఆలోచనలో సుక్కు ఉన్నాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version