క‌డెం అందాల‌పై టాప్ డైరెక్టర్ ప్రశంసలు

-

నిర్మల్ జిల్లాలోని కడెం రిజర్వాయర్ చాలా ప్రఖ్యాతి గాంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ కడెం రిజర్వాయర్ అందాలను చూసి టాలీవుడ్ టాప్ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఫిదా అయిపోయారు. దసరా సందర్భంగా అసలేం జరిగింది ? సినిమాలోని నిన్ను చూడకుండా… మనసు ఆగదు అనే పాటను విడుదల చేశారు డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఈ సందర్భంగా మోహన్ కృష్ణ మాట్లాడుతూ… కొత్త లొకేషన్ల కోసం తామెప్పుడూ విదేశాలకు వెళుతుంటామని… కానీ తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత సుందరమైన ప్రాంతాలు ఉన్నాయని తమకు తెలియదని చెప్పారు.

అసలేం జరిగింది చిత్రం ద్వారా తనకు తెలియని కొత్త ప్రాంతాలను అసలేం జరిగింది చిత్రబృందం యూనిట్ పరిచయం చేసినందుకు చాలా ఆనందంగా ఉందని స్పష్టం చేశారు. తాను తీసిన పలు చిత్రాలకు అసోసియేట్ కెమెరామెన్ గా పనిచేసిన రాఘవ… అసలేం జరిగింది సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం చాలా సంతోషంగా ఉందని మోహన్ కృష్ణ పేర్కొన్నారు.

థ్రిల్లర్ జోనర్ లో చిత్రీకరించిన ఇలాంటి సినిమాలకు ప్రజల్లో మంచి ఆదరణ వస్తుందని భరోసా కల్పించారు. అనంతరం నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ … డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి రాసిన ఈ పాటను యాజిన్ నిజర్ మరియు బాలికలు కలిసి ఎంతో మెలోడియస్ గా పాడారని పేర్కొన్నారు. అక్టోబర్ 22వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక అనంతరం దర్శకుడు ఎం.వి.ఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన యదార్థ సంఘటనల పై తీసిన చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news