మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. ఇండియన్ రైల్వేస్ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని వివిధ విభాగాల్లో 2206 ట్రేడ్ అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు.
ఈ పోస్టులకి నవంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఎటువంటి పరీక్ష నిర్వహిచడం లేదు. ఈ పోస్టులకి అప్లై చెయ్యాలంటే పదో తరగతి, సంబంధిత ఐటీఐ విభాగంలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక అర్హత విషయం లోకి వస్తే… దరఖాస్తుదారులు 10+2 విధానం లో 10 వ తరగతి/మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా కనీసం 50% మొత్తం మార్కులతో గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
ఇక వయస్సు విషయానికి వస్తే.. దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థుల కనీస వయస్సు 2021 జనవరి 1 నాటికి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు 13 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం వచ్చేసి ఈ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ఎటువంటి పరీక్ష నిర్వహిచడం లేదు. కేవలం పదో తరగతి, సంబంధిత ఐటీఐ విభాగంలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్ www.rrcecr.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే విజయపథం.కామ్ వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.