ప్రముఖ దర్శకుడు శంకర్.. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో సినిమా చేయబోతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ చిత్రాన్ని హీరో సూర్యతో చేస్తారని మొన్నటివరకు టాక్ రాగా.. ఇప్పుడా చిత్రాన్ని రాకింగ్ స్టార్ యశ్‌తో చేస్తారని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఆఫర్ ఎవరికి వరిస్తుందో?
కోలీవుడ్ దర్శకుడు శంకర్.. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఇండియన్ సినిమాల్లో తనకంటూ ఓ స్థానాన్ని దక్కించుకున్న ఈయన.. మెసేజ్ ఒరియెంటెడ్ సినిమాలకు భారీ స్థాయిలో కమర్షియల్ హంగులను అద్ది సక్సెస్‌ను అందుకున్నారు. అయితే ప్రస్తుతం కమల్‌హాసన్‌తో భారతీయుడు 2, రామ్‌చరణ్‌తో ఆర్సీ 15 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాల తర్వాత ఆయన ఏకంగా రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది.
ఈ సంగతి పక్కనపెడితే.. కేజీయఫ్ 1, 2 చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు రాకింగ్ స్టార్ యశ్. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలతో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు తన కొత్త సినిమాను ప్రకటించలేదు. దీంతో ఆయన తర్వాత చిత్రం ఏంటి? అన్న ప్రశ్న.. ప్రస్తుతం సినీ అభిమానుల అందరిలోనూ మెదులుతోంది.
అయితే తాజాగా ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. అదేంటంటే శంకర్-యశ్ కాంబోలో ఓ సినిమా రానుందని ప్రచారం సాగుతోంది. అంటే శంకర్ తీయబోయే ఆ వెయ్యి కోట్ల సినిమా.. యశ్‌తోనే అని సినీ వర్గాల టాక్. ఈ మూవీని కరణ్ జోహార్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా, పెన్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉందట. అయితే అంతకుముందు ఇదే సినిమాను శంకర్.. తమిళ స్టార్ హీరో సూర్యతో తీయబోతున్నారని వార్తలు వచ్చాయి. అసలు ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు గానీ.. ఒకవేళ తెరకెక్కితే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఈ భారీ ప్రాజెక్ట్‌లో సూర్య నటిస్తారో లేదా యశ్ నటిస్తారా అనేది చూడాలి.
నవల ఆధారంగా.. తమిళ ఎపిక్ నవల ‘వల్పరి’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. సు.వెంకటేశన్ రాసిన ఈ నవల సాహిత్య అకాడమీ అవార్డును దక్కించుకుంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.