BREAKING : టాలీవుడ్ లో మరో విషాదం… “యమగోల” దర్శకుడు తాతినేని మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు అనారోగ్యం, కరోనా మహమ్మారి ఇలా ఎన్నో సమస్యలతో… కాలం చెల్లించారు. అయితే.. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు కన్నుమూశారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు.

తాతినేనిరామారావు తెలుగు, హిందీ సినిమాల దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఎన్.టి.రామారావు నటించిన యమగోల చిత్రానికి ఈయనే దర్శకుడిగా వ్యవహరించారు.
రామారావు 1938లో కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించాడు. టి.రామారావుగా సుపరిచితులు. హిందీ,తెలుగు సినిమాలను 1966, 2000 మధ్య 65 వరకు దర్శకత్వం వహించారు. ఇక ప్రముఖ సినీ దర్శకుడు తాతినేని రామారావు మృతి పట్ల టాలీవుడ్‌ పెద్దలు, ఇతరులు సంతాపం తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version